TPT: మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌కు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తుడా ఛైర్మెన్ దివాకర్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి నారాయణ, చంద్రగిరి MLA పులివర్తి నాని, టీటీడీ ఛైర్మెన్ బీఆర్.నాయుడు స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.