GDWL: ఇసుక మాఫియా కొత్త పద్ధతిలో అక్రమ దందాకు పాల్పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇసుక తరలింపునకు అనుమతులు తీసుకుని, వాటిని తెలంగాణలో అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను మానవపాడు పోలీసులు బుధవారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తాడిపత్రి నుంచి వే బిల్లుల సహాయంతో ఇసుకను తరలిస్తూ హైదరాబాద్ వైపు తీసుకెళ్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు.