KMM: భూభారతి చట్టం ద్వారా సాదాబైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. సాదాబైనామాలపై ఉన్న స్టేను రాష్ట్ర హైకోర్టు మంగళవారం తొలగించిందని తెలిపారు. ఈ తీర్పుతో లక్షలాది మంది పేద ప్రజల కలలను సాకారం చేస్తుందని పేర్కొన్నారు.