SRD: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ బుధవారం తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రావొద్దని అన్నారు. ప్రజలు వాగులు, చెరువులు, కుంటల దగ్గరికి వెళ్లకూడదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.