TG: HYDలోని టెక్ మహీంద్రా వర్సిటీలో ఇటీవల నార్కోటిక్ అధికారుల తనిఖీల్లో ఐదుగురు విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై వర్సిటీ అధికారులు కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజులు మెదురి లేఖ విడుదల చేశారు. వర్సిటీకి చెడ్డపేరు తెచ్చే వారి పట్ల తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.