BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని అంగన్వాడీ టీచర్ పోస్టు ఎంపికలో అవకతవకలు జరిగాయని లబ్ధిదారులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన వారికి బదులు కార్యకర్తలకు పోస్టులు కేటాయించినట్లు సమాచారం. ఈ ఘటనపై సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. నియామక ప్రక్రియలో పారదర్శకత అవసరమని వారు నొక్కి చెప్పారు.