ఉపరాష్ట్రపతి అభ్యర్థులను ఈసీ అధికారికంగా ప్రకటించింది. NDA అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్లను ఆమోదించినట్లు ఈసీ తెలిపింది. కాగా, సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పోలింగ్ జరగనుండగా.. అదే రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఈసీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.