TG: భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అధిక ప్రభావం ఉందని చెప్పారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని.. కామారెడ్డి, మెదక్ కలెక్టర్లను ఆదేశించారు.