TPT: తిరుపతి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం వినాయకచవితి ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూజలో పాల్గొని సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పోలీసులను అభినందించారు. అనంతరం విజ్ఞేశ్వరుడి కరుణ జిల్లా ప్రజలపై ఉండాలని, పోలీసులకు ఎల్లప్పుడూ ఆశీర్వాదం లభించాలన్నారు.