TPT: చంద్రగిరి పరిధిలో 17 మంది పేకాటరాయుళ్ళను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకెళ్తే ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసి నరసింగాపురం ఎస్సీ కాలనీ సమీపంలో పేకాట ఆడుతున్నారని సమాచారం అందజేసింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు డ్రోన్ కెమెరా టీం వెంటనే అక్కడకు చేరుకుని 17 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుండి 1,40,000 నగదు, 15 మొబైల్ ఫోన్స్, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.