HNK:వేయి స్తంభాల గుడిలో బుధవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య గణపతి మహారాజ్కి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణపతికి నిర్వహించిన పల్లకి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేయి స్తంభాల దేవాలయం చుట్టూ గణపతి పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని పల్లకిని భుజాలపై మోశారు.