AP: విద్యుత్ లైన్మెన్ మృతిపట్ల మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా భట్టిప్రోలులో విధి నిర్వహణలో లైన్మెన్ సురేష్ మృతి చెందాడు. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. సురేష్ భార్యకు ఉద్యోగం కల్పించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.