BPT: బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఏఆర్ కార్యాలయంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి సాంప్రదాయ వస్త్రధారణలో కుటుంబ సమేతంగా విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతర్ తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.