W.G: భీమవరం పట్టణం, రూరల్ మండలాలకు కొత్త కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియమితులయ్యారు. భీమవరం పట్టణ అధ్యక్షుడిగా మద్దాల సాయి కుమార్, రూరల్ మండల అధ్యక్షుడిగా వెంకట్ రాజును రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల రెడ్డి నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతారాం ఈ అధ్యక్షులను అభినందించారు.