మేడ్చల్: హబ్సిగూడ, రామంతపూర్, ఉప్పల్ ప్రాంతాల పరిధిలో ప్రస్తుతం మొత్తం 9,278 మందికి ప్రభుత్వం ఆసరా పింఛన్లను ప్రభుత్వం అందజేస్తుంది. గత 4 సంవత్సరాలుగా దరఖాస్తు చేసుకొని అర్హులైన వారికి పింఛన్లు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో మంజూరు అవుతాయనుకుంటే నిరాశ మిగిలింది. ఇంకెప్పుడు మంజూరు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.