HYD: నగరంలో ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వ్యాప్తి విపరీతంగా పెరుగుతుంది. దగ్గు, జ్వరం, జలుబు లాంటివి వస్తుండగా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇంట్లో ఒక్కరికి వస్తే మిగతా వారికి సైతం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ సరిత తెలిపారు. ఈ నేపథ్యంలో దగ్గు, జలుబు లాంటివి ఒకరి నుంచి ఒకరికి రాకుండా ఉండటానికి మాస్కులు ధరించడం మంచిదని సూచించారు.