KMR: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో సుమారు 60 మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన కామారెడ్డి పట్టణ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వరద నీటిలో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో సురక్షితంగా పునరావాసలకు తరలించారు.