CTR: పులిచెర్ల(M) కే. కొత్తపేటలో ముస్లిం సోదరులు షేక్ చాంద్ బాషా, షేక్ ఫిరోజ్ భాష వినాయక చవితి సందర్భంగా గణపతికి పూజలు చేశారు. ఈ మేరకు వీరు నిర్మించిన ఆలయంలో వినాయకునికి పూజలు, అన్నదానం చేశారు. ఇందులో భాగంగా మతసామరస్యాన్ని చాటిన ఈ సోదరులను పలువురి అభినందనలు అందుకుంటున్నారు. కాగా, వీరు హిందూ దేవాలయాన్ని నిర్మించి అర్చకుడిని పెట్టి పూజలు చేయించడం విశేషం.