UP T20 లీగ్‌లో రింకూ సింగ్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఈ టోర్నీలో మీరట్ మెవెరిక్స్‌కు ఆడుతున్న అతడు గోరఖ్‌పూర్‌తో మ్యాచ్‌లో 48 బంతుల్లోనే సెంచరీ బాదాడు. తాజాగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ 27 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 57 పరుగులు చేశాడు. దీంతో ఆసియా కప్ జట్టులో తన ఎంపిక సరైనదే అని నిరూపిస్తున్నాడు.