W.G: పేరుపాలెం బీచ్ వద్ద బుధవారం వాతావరణం ప్రతికూలంగా మారింది. అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలలు ఉద్ధృతంగా విరుచుకుపడుతున్నాయి. దీంతో అధికారులు బీచ్ వద్ద స్నానం చేయడానికి అనుమతి నిరాకరించారు. బీచ్‌కు వచ్చిన సందర్శకులను పోలీసులు, స్థానిక సిబ్బంది అవగాహన కల్పించి, సముద్రం ఉద్ధృతంగా ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీరప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.