TG: కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షానికి గోడ కూలి యువ వైద్యుడు మృతి చెందిన ఘటన రాజంపేటలో చోటుచేసుకుంది. రాజంపేటకు చెందిన వినయ్(28) గుండారం పల్లె హాస్పిటల్లో వైద్యుడిగా పని చేస్తున్నారు. చెరువు కట్ట తెగి ఇంట్లోకి నీరు రావడంతో.. గోడకు రంధ్రం చేసే క్రమంలో ప్రమాదవశాత్తూ గోడ కూలి మీద పడింది. దీంతో వినయ్ అక్కడికక్కడే మృతి చెందాడు.