కృష్ణా: చల్లపల్లి మండలం వెలువోలులో కేఈబీ ప్రధాన పంట కాలువ పొంగిపొర్లుతున్న సమస్యపై అధికారులు స్పందించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశాలతో జల వనరుల శాఖ డీఈఈ బీబీఎస్ గణపతి చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం సెక్షన్ ఏఈఈ తానేటి ప్రసాద్ కాలువ వద్ద పరిస్థితి పరిశీలించి సమస్యను డీఈఈకి వివరించారు. కేఈబీకి డిస్చార్జ్ తగ్గించినట్లు ఈఈ రవికిరణ్ తెలిపారు.