ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత వెంకటాపురంలోని వారి నివాసంలో వినాయకుడి పూజలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏర్పడే సకల విఘ్నాలను తొలగించాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నానని ఆమె తెలిపారు. రైతన్నల కుటుంబాల్లో సుఖశాంతులు వెల్లివిరిసేలా గణనాథుడు దీవించాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు.