అన్నమయ్య: కలెక్టరేట్ వరకు హైరోడ్ విస్తరణ పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా వినాయక చవితి రోజు విష్ణు భవన్ హోటల్ వద్ద యజమాని అనుమతితో భవనాన్ని పడగొట్టారు. ఈ మేరకు శిథిలాలను ఏసీపీ నాగేంద్ర ఆధ్వర్యంలో తొలగించారు. అనంతరం ప్రజలందరి సహకారంతోనే నగర అభివృద్ధి సాధ్యమని ఆయన చెప్పారు. కాగా, రోడ్డు విస్తరణకు దుకాణాల యాజమానులు సహకరించాలని కోరారు.