MDK: మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించినట్లు DEO రాధా కిషన్ తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెలవు ప్రకటించినట్లు అధికారులు పేర్కొన్నారు.