ATP: అనంతపురంలోని ఉపాధి కార్యాలయంలో ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి పల్లవి తెలిపారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమాతో పాటు ఆపై చదివిన వారు అర్హులని చెప్పారు. 19-27 ఏళ్ల వయసు గల జిల్లా నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చదువు ధ్రువపత్రాలతో మేళాలో పాల్గొనాలని కోరారు.