కరీంనగర్ గ్రానైట్‌కు కేరాఫ్ అని అందరికి తెలిసిన విషయమే. అయితే, గ్రానైట్ రాళ్లను తరలిస్తున్న లారీలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎలాంటి భద్రతా చర్యలు లేకుండా, అతి వేగంగా వెళ్తున్న ఈ భారీ వాహనాలతో రోడ్డుపై ప్రయాణించే వారు భయపడుతున్నారు. లారీలపై నుంచి ఎప్పుడు రాళ్లు జారిపడతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.