వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. PM స్వనిధి పథకం గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం గడువును 2030 మార్చి 30 వరకు పొడిగించింది. స్వనిధి పథకం వ్యయం రూ.7,332 కోట్లు అని తెలిపింది. ఈ పథకం ద్వారా కోటి మంది వీధి వ్యాపారులకు లబ్ది చేకూరనుంది. వీధి వ్యాపారుల కోసం UPI లింక్ రూపే క్రెడిట్ కార్డు కూడా అందుబాటులో తీసుకుని వచ్చింది.