NTR: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి బుధవారం వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం లారీ స్టాండులో భవానీపురం లారీ సప్లయర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అసోసియేషన్ పెద్దలు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.