ATP: ఇటీవల విడుదలైన మెగా డీఎస్సీ పరీక్ష ఫలితాలలో గుంతకల్లు మండలం పులగుట్టపల్లి పెద్దతండ గ్రామానికి చెందిన రాజేష్ నాయక్ SGT పోస్ట్ కైవసం చేసుకున్నాడు. రాజేష్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజన పేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాజేష్ నాయక్‌ను గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించారు.