TG: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట సమీపంలో గేదెలను మేపడానికి వెళ్లి ఐదుగురు కాపరులు ఎగువ మానేరులో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్‌కి చేరవేయగా ఆయన కలెక్టర్ సందీప్ కుమార్‌కు ఫోన్ చేసి.. వారిని రక్షించే ఏర్పాట్లు చేయామని ఆదేశించారు. అప్రమత్తమైన NDRF బలగాలు రంగంలోకి దిగాయి.