KMR: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క టెలికాన్ఫరెన్స్ ద్వారా బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎస్పీ రాజేశ్‌కి కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.