ADB: గిరిజన మారుమూల ప్రాంతం నుంచి పుస్తక రచయితగా ఎదగడం అభినందనీయమని ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లాధ్యక్షుడు పెందోర్ సంతోష్ అన్నారు. గాదిగూడ మండల కేంద్రానికి చెందిన పెందోర్ దీపికా రాష్ట్రం నుంచి పుస్తక రచయితగా ఎంపికై బెంగళూరులో 5 రోజుల శిక్షణ పూర్తి చేశారు. దీంతో ఆదివాసీలు ఆమెను శాలువాతో సన్మానించి అభినందించారు.