WNP: వినాయక చవితి పండుగ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దంపతులు వనపర్తి లోని తన స్వగృహంలో వినాయకుణ్ణి ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. విజయ గణపతి సకల విఘ్నాలు తొలగించి విజయాలు కలిగించాలని, తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.