HYD: గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే సుమారు 15 వేలకు పైగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తమకు అందలేదని పలువురు లబ్ధిదారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు.