MNCL: తాండూరు మండలం నర్సాపూర్ గ్రామ శివారు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 14 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. బ్రిడ్జి నిర్మించాలని MRO కార్యాలయం ఎదుట గత 9 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టిన అధికారులలో స్పందన లేదని విమర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో వాగు దాటే అవకాశం లేదన్నారు. అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మించాలన్నారు.