WGL: గణేశ్ మండపాలను ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని బుధవారం సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. పాయింట్ బుక్‌లను ఏర్పాటు చేసి మండప నిర్వాహకులను సైతం నిరంతరం అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన విగ్రహల వివరాలను ఆన్లైన్లో 100% నమోదు చేసి ఉండాలన్నారు.