KNR: గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారితో, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం ఫోన్లో మాట్లాడారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన రైతులు పిట్ల నర్సింలు ధ్యాన బోయిన స్వామి, పిట్ల మహేష్, పిట్ల స్వామి, జంగం స్వామిలు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.