ప్రకాశం: హనుమంతుని పాడు మండలంలో వినాయక చవితి పండగ బుధవారం అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాధవరావు మండలంలోని కోట తిప్పల, కొండారెడ్డిపల్లి తదిత గ్రామాలలో పర్యటించారు. ఇందులో భాగంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు విగ్రహాల వద్ద తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలు గురించి పలు సూచనలు చేశారు. కాగా, రాత్రి 10:00 దాటిన తర్వాత విగ్రహాల వద్ద పెద్ద శబ్దాలను నిలిపివేయాలన్నరు.