SRCL: గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు ఐదుగురు వెళ్లారు. ఇవతలి వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తూ వారిలో ఒకరు గల్లంతు కాగా, నలుగురు చిక్కుకున్నారు.