CTR: కుప్పం నియోజకవర్గ పరిధిలోని హంద్రీనీవా కాలువలో వినాయక నిమజ్జనాలు చేయకూడదని డీఎస్పీ పార్థసారథి ఓ ప్రకటనలో తెలిపారు. కుప్పం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృష్ణా జలాలు హంద్రీనీవా కాలువకువస్తున్నాయన్నారు. ఇందులో వినాయక నిమజ్జనాలు జరిపితే నీటి ప్రవాహానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలు గమనించి నిమజ్జనాలు కాలువలో చేయడం విరమిమించుకోవాలన్నారు.