ప్రకాశం: పామూరు మండలంలోని మోపాడు రిజర్వాయర్ను బుధవారం మోపాడు రిజర్వాయర్ సూపర్ వైస్ ఛైర్మన్ మోరబోయిన నరసింహారావు, ఎస్సై జిలాని పరిశీలించారు. ఈ మేరకు వినాయక చవితి సందర్భంగా వినాయక బొమ్మల నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ మేరకు చుట్టుపక్కల గ్రామాల నుండి తీసుకువచ్చే వినాయక విగ్రహాలను వరుస క్రమంలో నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.