SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు భారీగా పోటెత్తింది. దీంతో నేడు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి దిగువకు మంజీరాలో 40,346 క్యూసెక్కులు వదిలినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 42,497 క్యూసెక్కుల వరద జలాలు ప్రాజెక్టులో చేరి 18.037 టీఎంసీలకు నీటిమట్టానికి చేరుకుందన్నారు. ప్రతి 3గంటలకోసారి వరదపై అధికారులు పరిశీలిస్తున్నారు.