E G: అల్పపీడన ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి రాజమహేంద్రవరంలో భారీ వర్షం కురుస్తోంది. ప్రతి ఏటా వినాయక చవితికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వినాయక ప్రతిమలతో పాటు, పూజా సామాగ్రి విక్రయాలు జరుపుతుంటారు. వర్షం కారణంగా కొనుగోలుదారులు తీసుకొచ్చిన సామాగ్రి మిగిలిపోవడంతో వ్యాపారులు దిగాలు చెందుతున్నారు.