నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని స్థానికులు 108 ద్వారా నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.