AP: బుడమేరు వరద రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి ఏపీలో జరుగుతోందని అన్నారు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అని తెలిపారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యం చేస్తామన్నారు. వర్షాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.