NLR: ఆదూరుపల్లిలో వినాయక చవితి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత చురుకుగా పాల్గొని 41 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అన్ని దానాలలో రక్తదానం గొప్పదని నిర్వహకులు కుండా శివ, షేక్ నియాజ్ తెలిపారు. యువతలో సేవాభావం పెంపొందించేందుకు ఇలాంటి శిబిరాలు మరింత అవసరమని వారు పేర్కొన్నారు.