TPT: వినాయక చవితి సందర్భంగా తొట్టంబేడు మండలం మరియు శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతాలలోని వినాయక విగ్రహాలను పెద్ద కన్నలి గ్రామం వద్ద తెలుగు గంగ కాలువలో నిమజ్జనం చేశారు. ఇందులో భాగంగా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టూ టౌన్ సీఐ నాగార్జున రెడ్డి సీసీ కెమెరాలు, ఎల్ఈడీ లైట్లను ఏర్పాట్లు చేశారు.