అన్నమయ్య: రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం తన స్వగ్రామం బోరెడ్డిగారిపల్లిలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, అధికారులకు ఫోన్ చేసి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.