ADB: డెంగ్యూ భారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తాంసి PHC హెల్త్ సూపర్వైజర్ తులసీ రాం అన్నారు. బుధవారం తాంసి PHC పరిధిలోని పిప్పల్ కోటి గ్రామంలో పెంట లక్ష్మీ అనే మహిళకు డెంగ్యూ నిర్ధారణ కావడంతో ఆ ఇంటి పరిసరాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అనంతరం స్థానిక గ్రామపంచాయతీ వద్ద ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. పలువురికి మందులను పంపిణీ చేశారు.